సత్యనారాయణ గౌడ్ కు ఘన సన్మానం

 సత్యనారాయణ గౌడ్ కు ఘన సన్మానం

న్యూస్ పవర్  , 24 నవంబర్, ఇల్లంతకుంట:
ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఎస్.ఈ గా ఉద్యోగ విరమణ పొందిన ఇల్లంతకుంట గ్రామానికి చెందిన సుదగోని సత్యనారాయణ గౌడ్ ను గౌడ సంఘ సభ్యులు, అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి, పూలమాల వేసి అభినందించారు. సుదీర్ఘ కాలం పాటు ఇరిగేషన్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన సత్యనారాయణ గౌడ్, ఉద్యోగంతో పాటు సామాజిక సేవలోనూ ముందుండేవారని సభ్యులు కొనియాడారు. అయ్యప్ప భక్తులకు, గౌడ సంఘానికి ఆయన ఎప్పుడూ అండగా నిలిచారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, అయ్యప్ప స్వాములు, స్థానికులు  పాల్గొన్నారు

Post a Comment

0 Comments