రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు డీఎస్పీ, సీఐలకు ఆహ్వానం

రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు డీఎస్పీ, సీఐలకు ఆహ్వానం

 న్యూస్ పవర్ , 24 నవంబర్  ఇల్లంతకుంట:
ఈ నెల 26న ఇల్లంతకుంట మండల కేంద్రంలో మండల అభివృద్ధి ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని కోరుతూ ఐక్య వేదిక ప్రతినిధులు మంగళవారం సిరిసిల్ల డీఎస్పీ  కత్తురోజు నాగేంద్ర చారి , సీఐ నాగేశ్వర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకల ప్రాముఖ్యతను వారికి వివరించి, కార్యక్రమానికి తప్పక విచ్చేయాలని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి ఐక్య వేదిక అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్, అధికార ప్రతినిధి ఏనుగుల లింగన్న, ఉపాధ్యక్షుడు బత్తిని భూమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments